Monday, August 25, 2008

ఆనందం అంటే నీవు ఆనందించడంతో పాటు ఎదుటి వారికి ఆనందం ఉండాలి.....

మంచి అనే ఉద్యానవనంలో వికసించిన కుసుమానివో
మది అనే నదిలో ప్రవహించే అమౄతానివో
మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో
మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో...

మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో
వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో
వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...

ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో
స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో
మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో
అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో...

చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకు
నేను ఎల్లపుడూ సిద్ధం
మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితే
కలిసి పయనిద్ధాం
నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైన
అర్ధాన్నందించిన ఓ స్నేహమా
అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడా
కాసింత చోటు కల్పించవూ....

ఎవరి మనస్సులో రహస్యాలు,అవగాహనలు సమనంగా ఉంటాయో వారి స్నేహం ఎప్పుడూ క్షీణించదు.
ఆపద సమయంలో కూడా వదలని మిత్రుడితో స్నేహం చేయాలి..మధురంగా సంభాషించే మిత్రుడిని వదలుకొవద్దు.
ఆనందం అంటే నీవు ఆనందించడంతో పాటు ఎదుటి వారికి ఆనందం ఉండాలి.....

No comments: