Wednesday, August 20, 2008

ఉదయించిన హృదయానికి పట్టం కడదాం

ఏమి ఈ విశాల ప్రపంచం... సరి కొత్తగా వికసించింది...
అదిగో అదిగదిగో ఉదయించే హృదయం...
ఆ హృదయానికి...
ఆశలు లేవు, ఆశయాలు తప్ప !
కబుర్ల కాలక్షేపం.. లేదు కార్యాచరణ తప్ప...
ఆ హృదయానికి...
మనిషి విలువ తెలుసు... మనసు విలువ తెలుసు...
మట్టి విలువ తెలుసు...
చిరు చెమట చిందించే కన్నీటి విలువ తెలుసు...
ఆ హృదయం తల్లడిల్లుతుంది
పేదవాడి పేగు మాసిపోకముందే...
ఆ ఊపిరి ఆగిపోకముందే...
ఆ హృదయం విచ్చుకుంది...
మహామహులంతా విహంగ వీక్షణం వేళ
మేడలు మేఘాన్ని తాకినా... గుడిసెలు మాత్రం నేలపాలే...
అంతరాల్లో దాగిన ఆంతర్యం తెలిసినవాడు
మసకబారిన 'పేదరికం'... 'మధ్యరకం'...
మద్దెల దరువు వేటలో చిక్కుకొని
చిదిమి పోతుంది... రక్తం పొరలిపోతుంది...
అర్ధరాత్రి నీళ్ళు తాగిన కడుపుకి
ఆకలేసిన ఘోరం... గుండె ఆగిన ఘోరం...
చదవాలన్న తపన చదువుకోలేని యాతన...
ఎగసిపడే ఆలోచనలు... ఎదురుపడని అవకాశాలు...
ఎన్నని చెప్పను... ఏమని చెప్పను...
అలసి సొలసి పోరాడి వెళ్ళిపోయిన ఓ మహానుభావులారా మళ్ళీ పుట్టండి...
మనసార దీవించండి...
ఈ తల్లడిల్లే హృదయానికి మీతోడు కావాలి...
ఉదయించిన హృదయానికి పట్టం కడదాం

No comments: