ప్రాణ స్నేహం అంటే నమ్మకం లేదు నాకు. ప్రాణమివ్వగలను అనుకోను నేను. ఇంకొకరు నాకోసం ప్రాణం ఇవ్వడం అన్న ఆలోచన దుర్భరం. ఎందరో ప్రాణాల త్యాగాల వల్లే మన ప్రాణాలు నిలుస్తున్నాయి అనుకోండి. అది వేరే విషయం.
స్నేహం ఒక అందమైన వరం.
స్వంత వారు స్నేహంగా ఉండచ్చు.
స్నేహితులు సంబంధీకులూ అవ్వచ్చు.
కానీ స్నేహమొక్కటే ఉన్న సంబంధంలో ఏదో సంతోషముంది.
ఏమీ ఆశించని స్నేహం నాకిష్టం.
కలిసినప్పుడు కులాసాగా కబుర్లు చెప్పుకోవడం నాకిష్టం.
అందనంత దూరంలో ఉన్నా,
ఆనంద సమయంలో
తన వారు తక్కువని కాదు,
తను కూడా ఉంటే బాగుండును
అనిపించే భావం స్నేహం
Saturday, April 19, 2008
Subscribe to:
Posts (Atom)